Online Chatting: యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ చాటింగ్‌

Online Chatting: పరిచయం లేని అమ్మాయితో నిరంతరం వీడియోకాల్ * నగ్న వీడియోలు షేర్‌ చేసి ట్రాప్‌లో పడ్డ యువకుడు శ్రీకాంత్‌

Sandeep Eggoju
Updated on: 1 April 2021 1:45 PM IST
A Man has Died in the Issue of Online Chatting
X

బాధితుడు శ్రీకాంత్ (ఫైల్ ఫోటో)

Online Chatting: తెలియని అమ్మాయితో చాట్ చేయడం యువకుడి ప్రాణాలు పోయేలా చేసింది. నేను సింగిల్ అంటూ ఆన్‌లైన్‌లోకి వచ్చిన యువతి బుట్టలో పడి యువకుడు నిలువునా మోసపోయాడు. అమ్మాయి కవ్వింపు మాటలతో ఆన్‌లైన్ చాటింగ్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. అమ్మాయి న్యూడ్‌గా కనిపించడంతో అతడు కూడా నగ్నంగా ఆమెతో వీడియోకాల్‌లో మాట్లాడాడు. అబ్బాయి న్యూడ్ వీడియోలు సీక్రేట్‌గా రికార్డ్ చేసిన యువతి అతడ్ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. దీంతో పరువు పోగొట్టుకోవడం కన్నా.. ప్రాణం తీసుకోవడమే మేలని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలోని కోస్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఓ యువతితో ఫోన్ లో వీడియో చాట్ చేశాడు. యువకుడితో వీడియో చాట్ తర్వాత ఆ యువతి వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో ఆ యువకుడు భయపడ్డాడు. పరువు పోతుందని ఆందోళన చెందాడు. తన బ్యాంకు అకౌంట్‌లో ఉన్న 24 వేలు వారిచ్చిన ఖాతాకు బదిలీ చేశాడు. ఇంకా డబ్బు కావాలంటూ తరచూ ఫోన్‌ చేసి వేధించారు. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తే ఎక్కడ పరువు పోతుందో అని చెప్పి భయపడిన యువకుడు గ్రామంలోని పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

యువతితో మాట్లాడిన నగ్న వీడియో టేప్ లు సోషల్ మీడియాలో పెట్టకుండా ఉండాలంటే లక్షల్లో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story