‌‌‌సిద్దిపేట జిల్లా కొండపోచమ్మసాగర్ శివారులో ప్రేమజంట ఆత్మహత్య

Siddipet: వేప చెట్టుకు ఉరి వేసుకున్న మహేష్, స్వప్న

Jyothi
Published on: 10 Sept 2022 11:55 AM IST
A Love Couple Committed Suicide in Siddipet District
X

‌‌‌సిద్దిపేట జిల్లా కొండపోచమ్మసాగర్ శివారులో ప్రేమజంట ఆత్మహత్య

Siddipet: సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొండపోచమ్మ సాగర్ శివారులో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మర్కుక్‌కు చెందిన స్వప్న, మామిడ్యాల గ్రామానికి చెందిన మహేష్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మహేష్‌కు ఇది వరకే పెళ్లయింది. భార్య గర్బవతిగా ఉంది. కొద్ది రోజుల క్రితం నుంచి స్వప్న, మహేష్ కనిపించకుండా పోవడంతో రెండు పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. శనివారం ఉదయం ఇద్దరు కొండపోచమ్మ సాగర్ అటవీ ప్రాంతంలో వేప చెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మహేష్ తన మామకు సమాచారం ఇచ్చి సెల్ ఫోన్ ద్వారా లోకేషన్ షేర్ చేసి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story