సికింద్రాబాద్‌ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..

Agnipath: సికింద్రాబాద్‌ అల్లర్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Updated on: 23 Jun 2022 4:40 PM IST
A key Development in the Secunderabad Riots Case
X

సికింద్రాబాద్‌ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..

Agnipath: సికింద్రాబాద్‌ అల్లర్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విధ్వంసం రోజు ఉప్పల్‌ అకాడమీలో సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హకీంపేట్‌ సోల్జర్స్‌ గ్రూప్‌లో ఆందోళనకారులకు మద్దతిస్తున్నామని పోస్ట్‌లతో పాటు కీలక నిందితులతో ఫోన్‌లో సుబ్బారావు మాట్లాడినట్టు పోలీసులు సమాచారం సేకరించారు.

A2-పృథ్వీరాజ్‌ సాయి డిఫెన్స్‌ అకాడమీ విద్యార్థిగా గుర్తింంచిన పోలీసులు విధ్వంసంలో కీలకంగా వ్యవహరించిన పలువురిలో సాయి డిఫెన్స్‌ అకాడమీ స్టూడెంట్స్‌ ఉన్నట్టు వివరించారు. ఇప్పటివరకు 63 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు.. 55 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో మరో ఎనిమిది మంది ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావు, శివ టాస్క్‌ఫోర్స్‌ అదుపులో ఉన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story