Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

Phone Tapping Case: ఎవిడెన్స్‌ను కోర్టుకు సమర్పించిన పోలీసులు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Jun 2024 5:24 PM IST
A key development in the phone-tapping case
X

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

Phone Tapping Case: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవిడెన్స్ మెటీరియల్‌ను మొత్తం నాంపల్లి కోర్టులో సమర్పించారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లు, సీడీలు, పెన్‌డ్రైవ్‌లను మూడు బాక్సుల్లో నాంపల్లి కోర్టుకు సమర్పించారు. సాక్ష్యాలన్నిటినీ జత పరుస్తూ మూడోసారి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిందితులకు తెలియకుండా ఎవిడెన్స్ రహస్యంగా ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కోరారు పోలీసులు. ఇక కేసులో కీలకంగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీల బెయిల్ పిటిషన్‌లపై విచారణను వాయిదా వేయగా, తిరుపతన్న, భుజంగరావుల బెయిల్ పిటిషన్లపై రేపు విచారణ చేపట్టనుంది నాంపల్లి కోర్టు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story