హైదరాబాద్ తార్నాకలో దారుణం.. లిఫ్ట్ పేరుతో బైక్ ఎక్కించుకుని అమ్మాయికి వేధింపులు..

A Girl Molest By Youth In Tarnaka In Hyderabad
x

హైదరాబాద్ తార్నాకలో దారుణం.. లిఫ్ట్ పేరుతో బైక్ ఎక్కించుకుని అమ్మాయికి వేధింపులు..

Highlights

Hyderabad: తప్పించుకునే ప్రయత్నంలో బైక్ నుంచి దూకిన ఆర్తి

Hyderabad: లిఫ్టు పేరుతో బైక్ ఎక్కించుకుని అమ్మాయిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత సోమవారం రాత్రి 11గంటల 30నిమిషాలకు తార్నాక సల్మాన్ హోటల్ వద్ద శ్రీధర్ అనే యువకుడు బైక్‌పై..పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చిన ఆర్తి అనే అమ్మాయిని ఎక్కించుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ద్విచక్ర వాహనంపై తార్నాక నుండి మెట్టుగూడ వద్ద దింపుతానని చెప్పి వాహనం ఎక్కించుకున్నాడు.

అనంతరం తనలో శ్రీధర్‌ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆర్తి ఆరోపించింది. లైంగికంగా వేధించడంతోనే బండిపై నుండి దూకినట్లు అమ్మాయి తెలిపింది. ఈ క్రమంలో మెట్టుగూడ సమీపంలో యూటర్న్ చేస్తుండగా మహిళా వాహనంపై నుండి కిందికి దూకడంతో ఒళ్లంతా తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే సంఘటన స్థలం నుండి శ్రీధర్ పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న తార్నాక పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories