Hyderabad: కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేసి అమ్ముతున్న ముఠా అరెస్ట్

Hyderabad: కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేసి అమ్ముతున్న ముఠా అరెస్ట్

Shekhar G
Published on: 28 Feb 2024 7:53 PM IST
A Gang Was Arrested For Making And Selling Adulterated Ginger And Garlic Paste
X

Hyderabad: కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేసి అమ్ముతున్న ముఠా అరెస్ట్

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి కల్తీ కలకలం రేగింది. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేసి అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌‌ఫోర్స్‌ పోలీసులు. నలుగురిని అదుపులోకి తీసుకొని.. వారి నుంచి 700 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, 625 కిలోల లోక్వాలిటీ వెల్లుల్లి, 100 కిలోల లో క్వాలిటీ అల్లం, 150 కిలోల క్రిస్టల్‌ సాల్ట్‌తో పాటు పలు కెమికల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీజ్‌ చేసినవాటి విలువ సుమారు 5 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డెక్కన్‌ ట్రేడర్స్‌ పేరుతో రాజేంద్రనగర్‌ ఉప్పరపల్లిలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్న ముఠా.. బేగంపేట్‌ కేంద్రంగా స్టోర్‌ చేసి అమ్ముతున్నట్టు సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్పష్టం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story