Hyderabad: కన్న కూతురిపై తండ్రి అత్యాచారం.. ఆ నరకం తప్పించుకునే క్రమంలో మరింత ప్రమాదంలోకి!

A Father Raped His Daughter In Hyderabad
x

Hyderabad: కన్న కూతురిపై తండ్రి అత్యాచారం.. ఆ నరకం తప్పించుకునే క్రమంలో మరింత ప్రమాదంలోకి!

Highlights

Hyderabad: తండ్రి అత్యాచార ఉదంతం తల్లికి చెప్పిన కూతురు

Hyderabad: ప్రస్తుతం కాలంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. బయటకు వెళ్లిందే చాలు తమ అమ్మాయి ఇంటికి క్షేమంగా వస్తుందా లేదా అనే భయం అందర్లోనూ ఉంటోంది. ఇక కొన్ని చోట్ల అయితే.. వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధుల్లా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామపిశాచి అయ్యాడు. హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఓ కన్న తండ్రి ..కూతురిపైనే అత్యాచారానికి పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. ఆ కామాంధుడి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు వేసిన అడుగులు ఇంకా కష్టాలను ఎదుర్కొనేలా చేశాయి. తప్పుల మీద తప్పుల మాదిరి మారటమే కాదు.. ఆమె జీవితాన్ని మరింత నరకప్రాయంగా మార్చింది.

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బిహార్‌కు చెందిన ఒక ఫ్యామిలీ కుత్బుల్లాపూర్ గ్రామంలో ఉంటోంది. ముగ్గురు పిల్లల్లో పెద్దదైన 18 ఏళ్ల అమ్మాయి తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. అయితే కరోనా కారణంగా చదువు మానిపించటంతో ఇంటి వద్దే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉంటోన్న ఆమెను కన్నతండ్రే లైంగికంగా వేధించసాగాడు. పలుమార్లు అత్యాచారం చేశాడు. ఎవరికి చెప్పొద్దని భయపెట్టాడు. ఈ క్రమంలో ఆ యువతి తల్లికి తనకు ఎదురవుతున్న నరకం గురించి చెప్పింది. అయితే కూతురి మాటలను పెడచెవిన పెట్టింది తల్లి. తండ్రిపై లేనిపోని మాటలు చెబుతావా అంటూ ఆ తల్లి కూతురిపైనే విరుచుకుపడింది. అయితే.. ఎలాగోలా ధైర్యం చేసి తండ్రి విషయాన్ని యువతి తల్లికి వివరించింది. అయినా కూడా ఆమె నమ్మలేదు. తండ్రిపై లేనిపోనివి చెప్పొద్దంటూ కొట్టిపారేసింది. దాంతో.. ఆ యువతికి ఏం చేయాలో అర్థం కాలేదు.

కాగా.. యువతికి సంతోష్‌ అనే వ్యక్తి గతేడాది దీపావళికి బీహార్‌ వెళ్లి తిరిగి వస్తుండగా రైలులో పరిచయం అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లను ఒకరినొకరు షేర్ చేసుకున్నారు. రోజూ చాట్‌ చేసుకునేవారు. గత నెల 26న సంతోష్‌ యువతిని కలవాలని కోరాడు. దాంతో.. ఆమె సికింద్రాబాద్‌కు వెళ్లింది. అనంతరం ఆమెను కుత్బుల్లాపూర్‌లో ఇంటివద్ద వదిలాడు. అయితే.. ఆ యువతి ఇంటికి వెళ్లలేదు. ఇంటికి వెళ్తే.. చెప్పకుండా బయటకు వెళ్లినందుకు తిడతారని భయపడింది. దాంతో.. తిరిగి సికింద్రాబాద్ స్టేషన్‌కు పారిపోయింది. అక్కడ రవి అనే వ్యక్తి సాయంతో సంతోష్‌కు ఫోన్ చేసింది. ఆ తర్వాత యువతి.. సంతోష్ ఇంటికి రవి సాయంతో వెళ్లింది. రోజు గడిచిన తర్వాత సంతోష్‌ యువతిని ఆమె ఇంటికి వెళ్లిపోవాలని చెప్పాడు. వెంట వచ్చిన రవిని యువతి ఉద్యోగం కావాలని కోరింది. దాంతో.. అతను సరే అని అమీన్‌పూర్‌లోని తన గదికి తీసుకెళ్లాడు.

రెండ్రోజులు యువతి రవి ఇంట్లోనే ఉంది. గత నెల 29న మద్యం మత్తులో గదికి వెళ్లిన రవి.. యువతిపై లైంగిక దాడి చేశాడు. మరుసటి రోజు యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. వారు సికింద్రాబాద్ స్టేషన్‌ వద్దకు వచ్చి యువతిని తీసుకెళ్లారు. ఆ తర్వాత సదరు బాధితురాలు బుధవారం రాత్రి జీడిమెట్ల పోలీసులకు జరిగిన విషయం అంతా చెప్పింది. తనపై దారుణాలకు ఒడిగట్టిన తండ్రి.. రవిపై ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లైంట్‌ను స్వీకరించిన పోలీసులు తండ్రితో పాటు రవి అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories