Hyderabad: పెట్రోల్ అయిపోయినా బైక్ దిగని కస్టమర్‌.. అలాగే తోసుకుంటూ వెళ్లిన రాపిడో రైడర్

A customer does not get off the Bike even though the Petrol has Run out
x

Hyderabad: పెట్రోల్ అయిపోయినా బైక్ దిగని కస్టమర్‌.. అలాగే తోసుకుంటూ వెళ్లిన రాపిడో రైడర్

Highlights

Hyderabad: హైదరాబాద్‌ ఓ వ్యక్తి రాపిడోలో బైక్ బుక్ చేసుకోని వెళ్తుండగా మార్గమధ్యంలో పెట్రోల్ అయిపోవడంతో బైక్ ఆగిపోయింది.

Hyderabad: హైదరాబాద్ మహానగరంలో ర్యాపిడో సేవలు విపరీతంగా కొనసాగుతున్నాయి. ఎక్కడికి వెళ్లాలన్నా వెంటనే ర్యాపిడో సేవలను వినియోగించుకుంటున్నారు ప్రయాణికులు. మనకు బైక్ లేకున్నా సరే... మొబైల్ ఫోన్లో ఇలా బుక్ చేస్తే... అలా వచ్చేస్తున్నారు బైక్ రైడర్లు. దీంతో మనం చేరుకోవాల్సిన గమ్యానికి చాలా సులభంగా చేరుకుంటున్నాం. ముఖ్యంగా ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంటే మనకు తక్కువ ధర పడుతుంది. అయితే తాజాగా ఈ ర్యాపిడో బైక్ డ్రైవర్‌కు వింత సంఘటన ఎదురయ్యింది. కస్టమర్ చేసిన పనికి... అతనికి చుక్కలు కనిపించాయి.

పెట్రోల్ అయిపోయినా కస్టమర్‌... బైక్ దిగలేదు. దీంతో అలాగే తోసుకుంటూ ర్యాపిడో రైడర్ వెళ్లాడు. హైదరాబాద్‌‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రాపిడోలో బైక్ బుక్ చేసుకోని వెళ్తుండగా మార్గమధ్యంలో పెట్రోల్ అయిపోవడంతో బైక్ ఆగిపోయింది. దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ వరకూ నడుచుకుంటూ రావాలని కస్టమర్‌ను రైడర్ అడగ్గా అతను తిరస్కరించడంతో ఇలా కస్టమర్‌ను బైక్‌పై కూర్చోబెట్టుకొని నెట్టుకుంటూ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories