Telangana: తెలంగాణ సీఐడీ ఎస్పీ కిషన్‌సింగ్‌పై కేసు నమోదు..

Telangana: మహిళా ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన చైతన్యపురి పోలీసులు

Shekhar G
Published on: 30 July 2023 2:33 PM IST
A Case Has Been Registered Against Telangana CID SP Kishan Singh
X

Telangana: తెలంగాణ సీఐడీ ఎస్పీ కిషన్‌సింగ్‌పై కేసు నమోదు.. 

Telangana: సీఐడీ ఎస్పీ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళా ఉద్యోగి చైతన్యపురి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న మహిళా ఉద్యోగికి ఎస్పీ కిషన్ సింగ్ 2020 లో మార్నింగ్ వాక్ లో పరిచయం అయినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఎస్పీ.... మహిళకు అసభ్యకర వాట్సాప్ మేసేజ్‌లతో తరుచూ వేధింపులకు గురిచేశాడు. ఎస్పీ ప్రవర్తనపై... మహిళా ఉద్యోగి పలుమార్లు హెచ్చరించినా ఎస్పీ తీరుమారలేదు. ఎస్పీ వేధింపులు తట్టుకోలేక మహిళా ఉద్యోగి చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story