తెలంగాణలో కొత్తగా 987 కరోనా కేసులు.. ఏడుగురు మృతి

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.

Arun Chilukuri
Published on: 29 Jun 2021 7:03 PM IST
987 New Coronavirus Cases Reported in Telangana Today 29 06 2021
X

తెలంగాణలో కొత్తగా 987 కరోనా కేసులు.. ఏడుగురు మృతి

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో 987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటు మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో ఏడుగురు కరోనా కాటుకు బలయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా వైరస్‌తో 3వేల 651 మంది చనిపోయారు. ఇదిలా ఉండగా నిన్న 14వందల 17మంది కరోనా నుంచి కోలుకుంటే ఇవాళ 13వందల 62మంది మాత్రమే ఆరోగ్యంగా కోలుకునున్నారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు 6,22,593కు పెరిగాయి. 6,05,455 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 13,487 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 1,21,236 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story