Telangana: రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. వెయ్యికి చేరువలో..

Telangana: తెలంగాణలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.

Samba Siva Rao
Updated on: 2 April 2021 11:19 AM IST
965 Corona Cases Filed in Telangana Today 02 April 2021
X

కరోనా వైరస్ ఫైల్ ఫోటో 

Telangana: తెలంగాణలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 965 కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌తో మరో ఐదుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 9 వేల 741కి చేరింది. ఇప్పటివరకు 17 వందల 6 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ‌్య 6 వేల 159కి చేరినట్లు వెల్లడించింది రాష్ట్ర వైద్యారోగ్యశాఖ.

GHMC పరిధిలో అత్యధికంగా 254 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 110, రంగారెడ్డి 97 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 64, నిర్మల్‌ 39, జగిత్యాల 35 కరోనా కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో కరోనా కేసులు పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మాస్క్ లు ధరించడం, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేశారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story