Ramachandra Reddy: 95 ఏళ్ల వయసులో సర్పంచ్‌ పీఠమెక్కిన రామచంద్రారెడ్డి

Ramachandra Reddy: వయసు కేవలం అంకె మాత్రమేనని సూర్యపేట జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి నిరూపించారు.

Arun Chilukuri
Published on: 22 Dec 2025 4:07 PM IST
Ramachandra Reddy: 95 ఏళ్ల వయసులో సర్పంచ్‌ పీఠమెక్కిన రామచంద్రారెడ్డి
X

Ramachandra Reddy: వయసు కేవలం అంకె మాత్రమేనని సూర్యపేట జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి నిరూపించారు. 95 ఏళ్ల వయసులో నాగారం గ్రామ సర్పంచ్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని ఆయనను అభినందించారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న తదితరులు హాజరై రామచంద్రారెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాగారం అభివృద్ధిలో ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story