తెలంగాణలో కొత్తగా 948 కరోనా కేసులు

Arun Chilukuri
Published on: 19 Oct 2020 8:39 AM IST
తెలంగాణలో కొత్తగా 948 కరోనా కేసులు
X

తెలంగాణలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 948 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,23,059కి చేరింది. కరోనాతో నిన్న ఒక్క రోజే నలుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,275కి చేరింది. కరోనా నుంచి తాజాగా మరో 1,896 మంది బాధితులు కోలుకోగా..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,00,686కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,091 యాక్టికవ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ పేర్కొంది. వీరిలో 17,432 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story