తెలంగాణలో కొత్తగా 948 కరోనా కేసులు!

తెలంగాణాలో గడిచిన 24 గంటల్లో 948 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,59,776 చేరుకుంది. అయితే ఇందులో 13,068 యాక్టివ్ కేసులుండగా,ఇప్పటివరకు 2.45 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు

Krishna
Published on: 18 Nov 2020 10:26 AM IST
తెలంగాణలో కొత్తగా 948 కరోనా కేసులు!
X

తెలంగాణాలో గడిచిన 24 గంటల్లో 948 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,59,776 చేరుకుంది. అయితే ఇందులో 13,068 యాక్టివ్ కేసులుండగా,ఇప్పటివరకు 2.45 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో కరోనాతో అయిదుగురు మృతి చెందారు. దీనితో మరణాల సంఖ్య 1,415కి చేరుకుంది. అటు కరోనా బారి నుంచి నిన్న1,607 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 49,72,407కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 154 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

Krishna

Krishna

Next Story