తెలంగాణలో కొత్తగా 922 కరోనా కేసులు

Arun Chilukuri
Published on: 2 Nov 2020 10:04 AM IST
తెలంగాణలో కొత్తగా 922 కరోనా కేసులు
X

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 922 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,40,970కి చేరింది. తాజాగా 1,456 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 2,21,992 మంది కరోనాను జయించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. తాజాగా కరోనా కారణంగా ఏడుగురు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,348కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,630 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. 14,717 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25,643 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 43,49,309కి చేరింది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story