ఇదో వలస విషాదం.. బావిలో తొమ్మిది మృతదేహాలు!

ఇదో వలస విషాదం.. బావిలో తొమ్మిది మృతదేహాలు!
x
Highlights

వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నగర శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న ఒక గన్నీ సంచుల గోదాం వద్ద పాడుబడ్డ...

వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నగర శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న ఒక గన్నీ సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో అనుమానాస్పద స్థితిలో ఇప్పటి వరకు తొమ్మిది మృతదేహాలు బయటపడ్డాయి. నిన్న నాలుగు మృతదేహాలు, ఇవాళ మరో ఐదు మృతదేహాలు గుర్తించారు. ఇందులో ఆరుగురు మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మిగతా వారిలో ఇద్దరు బిహార్‌, ఒకరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన డ్రైవర్‌గా గుర్తించారు.

పొట్టకూటి కోసం పశ్చిమ బెంగాల్‌ నుంచి వలస వచ్చిన కుటుంబం.. ఇరవై ఏళ్లుగా వరంగల్‌ కరీమాబాద్‌లో నివాసముంటూ చినిగిన బస్తా సంచులు(బార్‌దాన్‌) కుడుతూ పొట్ట పోసుకుంటున్నారు. దంపతులతో పాటు కుమార్తె, ఇద్దరు కుమారులు కలిసే ఉండేవారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనిచేసే చోటకు మకాం మార్చిన ఆ కుటుంబంలోని నలుగురు బావిలో.. గురువారం మృతదేహాలుగా తేలారు. ఎవరైనా హత్య చేశారా.. వారే ఆత్మహత్యకు పాల్పడ్డారా.. అందుకు కారణాలేమై ఉంటాయి.. అనే విషయంలో స్పష్టత లభించడం లేదు. మృతులు ఎండీ మక్సూద్‌(50), ఆయన భార్య నిషా(45), కుమార్తె బుస్ర (20), బుస్ర కుమారుడు(3)‌గా గుర్తించారు. ఇవాళ లభ్యమైన ఐదు మృతదేహాలు షాబాద్‌(22), సోహైల్‌(20), బిహార్‌కు చెందిన కార్మికులు శ్యామ్‌(22), శ్రీరామ్(20), వరంగల్‌ వాసి షకీల్ గా గుర్తించారు. ఘటనా స్థలిని వరంగల్‌ సీపీ రవీందర్‌, మేయర్‌ జి.ప్రకాశరావు పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను వరంగల్‌లోని ఎంజీఎంకి తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories