Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 869 కరోనా కేసులు, 8 మంది మృతి
Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుతోంది.
తెలంగాణలో కొత్తగా 869 కరోనా కేసులు, 8 మంది మృతి
Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో కొత్తగా 8వందల 69 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6లక్షల 24వేల 379కి చేరాయి. ఇక గత 24 గంటల్లో వైరస్ బారిన పడి 8 మంది ప్రాణాలు కోల్పోవడంతో తెలంగాణలో కరోనా మరణాలు 3వేల 669కి పెరిగాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 6లక్షల 7వేల 658 మంది డిశ్చార్జ్ కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 13వేల 52 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలంగాణ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
Next Story




