Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 848 కరోనా పాజిటివ్‌ కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.

Arun Chilukuri
Published on: 3 July 2021 7:08 PM IST
848 New Coronavirus Cases Reported in Telangana Today 3rd July 2021
X

తెలంగాణలో కొత్తగా 848 కరోనా పాజిటివ్‌ కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. వరుసగా మరో రోజు వెయ్యికి తక్కువగా పాజిటివ్ కేసు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో లక్ష ఎనిమిది వేల 954 శాంపిల్స్ సేకరిస్తే అందులో 848 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో మొత్తంగా 6లక్షల 26లు దాటింది. కరోనాతో మరో ఆరుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3 వేల 6వందల 84కి చేరింది.

గడిచిన 24గంటల్లో కరోనా నుంచి కోలుకుని మరో ఒక వెయ్యి నూట 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోవిడ్‌ను జయించిన వారి సంఖ్య 6 లక్షలు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల 454 యాక్టివ్ కేసులున్నట్టు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. మరోవైపు మరణాల రేటు తెలంగాణలో 0.58 ఉంటే దేశవ్యాప్తంగా 1.3శాతం ఉన్నట్టు పేర్కొంది. రికవరీల రేటు తెలంగాణలో 97.42 శాతం ఉంటే దేశంలో 97.03 ఉన్నట్టు హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story