తెలంగాణలో కొత్తగా 837 కరోనా కేసులు

Arun Chilukuri
Published on: 27 Oct 2020 7:54 AM IST
తెలంగాణలో కొత్తగా 837 కరోనా కేసులు
X

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 837 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,32,671కి చేరింది. తాజాగా 1,554 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 2,13,466 మంది కరోనాను జయించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. తాజాగా కరోనా కారణంగా నలుగురు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,315కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,890 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. 14,851 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story