Telangana Local Body Elections: నేను సైతం అంటూ ఎన్నికల పోటీలో దిగిన 75 ఏళ్ల వృద్ధురాలు

Telangana Local Body Elections: నేను సైతం అంటూ ఎన్నికల పోటీలో దిగిన 75 ఏళ్ల వృద్ధురాలు
x

Telangana Local Body Elections: నేను సైతం అంటూ ఎన్నికల పోటీలో దిగిన 75 ఏళ్ల వృద్ధురాలు

Highlights

Telangana Local Body Elections: నేను సైతం అంటూ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో సై అంటున్న 75 ఏళ్ల వృద్ధురాలు.

Telangana Local Body Elections: నేను సైతం అంటూ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో సై అంటున్న 75 ఏళ్ల వృద్ధురాలు. వయసు పైబడినా సేవాస్ఫూర్తితో ముందుకు వచ్చిన ఆమె, గ్రామాభివృద్ధే తన లక్ష్యమని చెబుతోంది. ఇంటింటికీ తిరిగి సమస్యలను వింటూ, నాకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇస్తోంది. పెద్దవారికి ఆదర్శంగా నిలుస్తూ, యువతకు స్ఫూర్తినిచ్చేలా ఎన్నికల రంగంలో అడుగు పెట్టిన ఈ వెంకటమ్మ పై గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో కాసిపేట వెంకటమ్మ అనే 75 ఏళ్ల వృద్ధురాలు సర్పంచ్‌గా పోటీ చేయడం గ్రామంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పట్ల గ్రామానికి సర్పంచ్ పదవి జనరల్ మహిళ రిజర్వేషన్ కేటాయించడంతో.. ఈ పదవికి 8 మంది మహిళ అభ్యర్థులు నామినేషన్ వేశారు. అందులో ఐదుగురు అభ్యర్థులు విత్ డ్రా కాగా, ముగ్గురు అభ్యర్థులు బరిలోకి దిగారు. ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఇదివరకే సర్పంచ్, ఎంపీటీసీ పదవులు చేసిన ఇద్దరు మహిళలు ఉండగా వృద్ధురాలు వెంకటమ్మ వారితో తలపడనుంది. ఇంతకుముందు సర్పంచ్ పదవులు చేసినవారు చేయని అభివృద్ధి తాను చేసి చూపిస్తానని ఓటర్లను పలకరిస్తూ తమకు ఓటు వేసి గెలిపించాలని వెంకటమ్మ అభ్యర్థిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories