Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 746 కరోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 19 July 2021 9:12 PM IST
746 New Coronavirus Cases Reported in Telangana Today 19th July 2021
X

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 746 కరోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొద్దిరోజులుగా ఆరేడు వందల దగ్గరే రోజువారీ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. గత 24గంటల్లో 746మందికి కరోనా నిర్ధారణ కాగా, ఐదుగురు మృత్యువాత పడ్డారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,37,373కు పెరిగింది. తెలంగాణలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3వేల 764కి చేరింది.

ఇక, రాష్ట్రంలో ప్రస్తుతం 9వేల 836 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మరణాల రేటు 0.59 శాతం కాగా.. రికవరీ రేటు 97.86 శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 71 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story