Konda Surekha: రూ.700 కోట్లతో వేములవాడ ఆలయం అభివృద్ధి చేస్తున్నాం

Konda Surekha: రూ.700 కోట్లతో వేములవాడ ఆలయం అభివృద్ధి చేస్తున్నాం
x

Konda Surekha: రూ.700 కోట్లతో వేములవాడ ఆలయం అభివృద్ధి చేస్తున్నాం

Highlights

Konda Surekha: తెలంగాణ కుంభమేళా మేడారం సమ్కక్క-సారలమ్మ జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చకాచకా పూర్తవుతున్నాయని అన్నారు మంత్రి కొండా సురేఖ.

Konda Surekha: తెలంగాణ కుంభమేళా మేడారం సమ్కక్క-సారలమ్మ జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చకాచకా పూర్తవుతున్నాయని అన్నారు మంత్రి కొండా సురేఖ. నిన్న ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశామని.. జనవరి 28 నుంచి మేడారంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలని కేసీఆర్‌ దంపతులను ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా జాతరకు వచ్చేందుకు ప్రయత్నిస్తానన్న మాజీ సీఎం కేసీఆర్.. సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధిపై వివరాలు అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు.

ఈ రెండేళ్లలో సమ్మక్క-సారలమ్మ దేవాలయం ఆదాయం సుమారు 500 కోట్లకు చేరినట్టు మంత్రి కొండా సురేఖ్‌ చిట్‌చాట్‌లో వెల్లడించారు. టెంపుల్‌ టూరిజంతో బాసర నుంచి అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. భద్రాచలం, బాసరలో టెంపుల్‌ టూరిజం మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నామని అన్నారు. వేములవాడలో ఏడు వందల కోట్లతో ఆలయం అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు మంత్రి కొండా సురేఖ.

Show Full Article
Print Article
Next Story
More Stories