TS Corona Cases: తెలంగాణలో కొత్త‌గా 6,551 మందికి కరోనా

TS Corona Cases: 24 గంటల్లో 6,551 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది.

Sandeep Eggoju
Published on: 26 April 2021 10:37 AM IST
6,551 New Corona Cases in Telangana
X

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

TS Corona Cases: తెలంగాణలో క‌రోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. 24 గంటల్లో 6,551 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం ఒక్క‌రోజులో కరోనాతో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 3,804 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,01,783కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,34,144 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,042గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 65,597 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,418 మందికి క‌రోనా సోకింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story