Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 6,361 కరోనా కేసులు, 51 మంది మృతి

Telangana Corona Cases: తెలంగాణలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది.

Arun Chilukuri
Published on: 5 May 2021 9:38 AM IST
6,361 New Coronavirus Cases Reported in Telangana on 5th May 2021
X

కరోనా(ఫైల్ ఇమేజ్ )

Telangana Corona Cases: తెలంగాణలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 6,361 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,69,722కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. ఒక్కరోజులో కరోనాతో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 2,527కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 77,704 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 1,225 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి నిన్న ఒక్క రోజు 8,126 మంది కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,32,67,252కి చేరింది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story