తెలంగాణలో కొత్తగా 631 కరోనా కేసులు

Arun Chilukuri
Published on: 4 Dec 2020 11:07 AM IST
తెలంగాణలో కొత్తగా 631 కరోనా కేసులు
X

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 631 కరోనా కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,72,123కి చేరింది. 1,467 మంది మరణించారు. కరోనాబారి నుంచి నిన్న 802 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,61,830కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,826 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 6,812 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 57,405 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 56,05,306కి చేరింది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story