గిరిజనులను వరించిన అదృష్టం.. అకౌంట్లలో రూ.60 కోట్లు జమ..

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలను అదృష్టం వరించింది.

Arun Chilukuri
Updated on: 19 Feb 2022 9:30 PM IST
60 Crore Money Credited in Tribes Account
X

గిరిజనులను వరించిన అదృష్టం.. అకౌంట్లలో రూ.60 కోట్లు జమ..

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలను అదృష్టం వరించింది. ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా వారి అకౌంట్లో అక్షరాల 60 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఒక్కసారిగా కోట్ల రూపాయల ఎకౌంట్లో జమకావడంతో అడవి బిడ్డలు అవాక్కయ్యారు. అకౌంట్లో ఒక్కసారిగా కోట్లు పడటంతో అవసరాల మేరకు డబ్బును ఉపయోగించుకున్నారు. అయితే ఇటీవల బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో షాక్‌కు గురయ్యారు.

ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జరిగింది. టెక్నికల్ ప్రాబ్లం వల్ల అలా తప్పు జరిగిందని అధికారులు గుర్తించారు. డబ్బు తిరిగి చెల్లించాల్సిందిగా గిరిజనులపై ఒత్తిడి చేయడంతో వారంతా బ్యాంకును ముట్టడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story