Top
logo

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
X
Highlights

Road Accident in Jagtial : జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటాపూర్-మోహన్ రావు పేట మధ్యలో...

Road Accident in Jagtial : జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటాపూర్-మోహన్ రావు పేట మధ్యలో జాతీయ రహదారిపై కోళ్ల పారం దగ్గర ఆగి ఉన్న లారీనీ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన ఓ కుటుంబం తమ బంధువులను కారులో జగిత్యాలలో దించి తిరుగు ప్రయాణంలో మల్లాపూర్ వెళ్తుండగా నిలిచి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. గాయపడిన మరో ముగ్గురిని జగిత్యాలలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో లత ,రమాదేవి, విష్ణు, ఆరు నెలల బాబు ఉన్నారు. శ్రీనివాస్, సృజన్, శ్రుతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

Web Title6 killed in road accident in jagtial
Next Story