Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 5,892 కరోనా కేసులు, 46 మంది మృతి

Telangana Corona Cases: తెలంగాణలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది.

Arun Chilukuri
Published on: 7 May 2021 9:58 AM IST
5,892 New Coronavirus Cases Reported in Telangana on 7th May 2021
X

Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 5,892 కరోనా కేసులు, 46 మంది మృతి

Telangana Corona Cases: తెలంగాణలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 5,892 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,81,640కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. ఒక్కరోజులో కరోనాతో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 2,625కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 73,851 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 1,104 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి నిన్న ఒక్క రోజు 9,122 మంది కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,34,23,123కి చేరింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story