తెలంగాణలో కొత్తగా 582 కరోనా కేసులు

Arun Chilukuri
Published on: 26 Oct 2020 10:11 AM IST
తెలంగాణలో కొత్తగా 582 కరోనా కేసులు
X

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 582 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,31,834కి చేరింది. తాజాగా 1,432 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 2,11,912 మంది కరోనాను జయించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. తాజాగా కరోనా కారణంగా నలుగురు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,311కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,611 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. 15,582 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 40,94,417కి చేరింది.





Arun Chilukuri

Arun Chilukuri

Next Story