Telangana Corona Cases: కొత్తగా 5,695 పాజిటివ్‌ కేసులు

Telangana Corona Cases: కొత్తగా 5,695 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Samba Siva Rao
Updated on: 3 May 2021 10:52 AM IST
corona virus telangana
X

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం



Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ రెండో ద‌శ కొన‌సాగుతుంది. అయిన‌ప్ప‌టికీ క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు 58,742 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 5,695 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 80,135 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 1352 కేసులు నమోదయ్యాయి.

ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,56,485కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 49 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 2,417కి చేరింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story