తెలంగాణలో కొత్తగా 509 కరోనా కేసులు

Arun Chilukuri
Published on: 17 Dec 2020 11:25 AM IST
తెలంగాణలో కొత్తగా 509 కరోనా కేసులు
X

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 509 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,79,644కు చేరింది. 1,505 మంది మరణించారు. కరోనాబారి నుంచి నిన్న 517 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,70,967కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,172 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 5,063 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 48,652 నమూనాలను పరీక్షించగా, ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 63,06,397కి చేరింది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story