Adilabad: తుమ్మల్‌పాడ్‌లో ప్రబలిన డయేరియా

X
డయేరియా బాదితులు (ఫైల్ ఇమేజ్)
Highlights
Adilabad: గ్రామంలో డయేరియా బారిన పడ్డ 50 మంది * డయేరియా బాధితుల్లో 20 మంది చిన్నారులు
Sandeep Eggoju7 April 2021 6:17 AM GMT
Adilabad: ఆదిలాబాద్ జిల్లా సిరికోండ మండలం తుమ్మల్‌పాడ్ గ్రామంలో డయేరియా ప్రబలింది. గ్రామంలో ఇప్పటి వరకు 50 మంది డయేరియా బారిన పడ్డారు. అందులో 20 మంది చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు అస్వస్థతకు గురైయ్యారు. మరి కొందరు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో చాలా మంది నీరసంతో మంచం పడుతున్నారు. గ్రామంలో వెంటనే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Web Title50 People in the Sirikonda Mandal Adilabad District have Contracted Diarrhea
Next Story