TS Corona Cases: తెలంగాణలో కొత్తగా 4,723 కేసులు, 31 మంది మృతి

TS Corona Cases: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వేలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Published on: 12 May 2021 7:56 PM IST
4723 New Coronavirus Cases Reported in Tealngana on 12 MAY 2021
X

తెలంగాణలో  కొత్తగా 4,723 కేసులు నమోదయ్యాయి (ఫొటో ట్విట్టర్)

TS Corona Cases: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 4వేల723 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,11,711 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా రాష్ట్రంలో 31 మంది కరోనాతో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, మొత్తం మరణాల సంఖ్య 2,834కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 59,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4లక్షల49వేల744 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 745 కేసులు నమోదయ్యాయని పేర్కొంది.

Venkata Chari

Venkata Chari

Next Story