Coronavirus: తెలంగాణలో గడిచిన 24గంటల్లో 4,446మందికి పాజిటివ్.. 12 మంది మృతి

Coronavirus: వరుసగా నాలుగో రోజు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు

Sandeep Eggoju
Updated on: 17 April 2021 12:27 PM IST
4,446 Positive Cases in Last 24 Hours in Telangana
X

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ అడ్డు అదుపు లేకుండా పెచ్చరిల్లుతోంది. వరుసగా నాలుగో రోజు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. గడిచిన 24 గంటల్లో లక్షా 26వేలకు పైగా పరీక్షలు నిర్వహించగా వారిలో 4వేల 4వందల 46 మందికి సోకినట్టు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరోనా సోకి మరో 12 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 18వందల 9కి చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 33వేల 514 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24గంటల్లో కోవిడ్ నుంచి కోలుకుని మరో 14వందల 14మంది డిశ్చార్జ్ అయ్యారు.. నిన్న నమోదు అయిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలోనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 598 మందికి కోవిడ్ సోకింది. నిజామాబాద్ 314, రంగారెడ్డి 326, సంగారెడ్డి 235, కామారెడ్డి 184, నిర్మల్ 160, నల్లగొండలో 168 పాజిటివ్ కేసులు నమోదు అయ్యినట్టు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story