TS Corona Cases: కొత్తగా 4,305 కరోనా పాజిటివ్

TS Corona Cases: తెలంగాణలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది.

Samba Siva Rao
Published on: 14 May 2021 8:34 PM IST
Corona Virus Positive Cases Telagana
X

 క‌రోనా వైర‌స్ 

TS Corona Cases: తెలంగాణలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గడచిన 24 గంటల్లో 57,416 కరోనా ప‌రీక్ష‌లు నిర్వహించగా.. 4,305 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 607 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు 5,20,709 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4,62,981 కొవిడ్ కోలుకున్నారు. ఇంకా 54,832 మంది చికిత్స పొందుతున్నారు.

గత కొన్నిరోజుల కిందటి తీవ్రతతో పోల్చితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 6,361 మంది కరోనా నుంచి కోలుకోగా... 29 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 2,896కి పెరిగింది.





Samba Siva Rao

Samba Siva Rao

Next Story