TS Corona Cases: తెలంగాణలో కొత్తగా 4,298 కేసులు, 32 మంది మృతి

4298 New Coronavirus Cases Reported in Tealngana on 15 MAY 2021
x

తెలంగాణలో కరోనా కేసులు (ఫొటో ట్విట్టర్)

Highlights

TS Corona Cases: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వేలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

TS Corona Cases: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 4వేల298 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,25,007 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా రాష్ట్రంలో 32 మంది కరోనాతో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, మొత్తం మరణాల సంఖ్య 2,928కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 53,072 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఈ రోజు 6వేల261 మంది కరోనా నుంచి కోలుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 601 కేసులు నమోదయ్యాయని పేర్కొంది.



Show Full Article
Print Article
Next Story
More Stories