TS Corona: తెలంగాణలో 24 గంటల్లో 14మంది మృతి.. భారీగా పాజిటివ్ కేసులు

Coronavirus: గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో 14 మంది మృతి

Sandeep Eggoju
Updated on: 19 April 2021 2:00 PM IST
4,009 new Corona Cases Registered In Telangana
X

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: తెలంగాణలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 83వేల, 89 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 4వేల 9మందికి పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3లక్షల, 55వేల, 433కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 16 మంది మరణించారు.

దీంతో కరోనాతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1,838కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,878 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,14,441కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,154 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 705 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,18,20,842కి చేరింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story