ఢిల్లీలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అధికార నివాసంలో కిడ్నాప్ కలకలం...

MP Jithender Reddy: రెండు వాహనాల్లో వచ్చి కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు...

Shireesha
Published on: 2 March 2022 10:44 AM IST
4 Members Kidnapped at Ex-MP Jithender Reddy House in Delhi | Breaking News
X

ఢిల్లీలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అధికార నివాసంలో కిడ్నాప్ కలకలం...

MP Jithender Reddy: ఢిల్లీలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి నివాసంలో జరిగిన కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. కారు డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు గెస్ట్‌లు కిడ్నాప్‌ అయ్యారు. ఢిల్లీ సౌత్‌ అవెన్యూలోని జితేందర్‌రెడ్డి ఇంట్లో జరిగిన ఈ ఘటనపై ఆయన వ్యక్తిగత సిబ్బంది ఢిల్లీ సౌత్‌ అవెన్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని సీసీ ఫుటేజ్‌ళను పరిశీలించిన పోలీసులు ఆలస్యంగా కేసు నమోదు చేసుకున్నారు.

మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఢిల్లీ వచ్చినప్పుడు సౌత్‌ అవెన్యూలోని 105 నివాసంలో ఉంటుంటారు. అయితే ఆయన లేనప్పుడు ఆయన గెస్టులు ఆ నివాసాన్ని వాడుకుంటుంటారు. మూడు రోజులుగా జితేందర్ రెడ్డి నివాసంలో కొందరు అతిథులు ఉంటున్నారు. నిన్న మధ్యాహ్నం తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఇంటి ప్రాంగణంలోకి చొరబడి జితేందర్‌ రెడ్డి కారు డ్రైవర్‌, మరో ముగ్గురు అతిథులను బలవంతంగా లాక్కళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Shireesha

Shireesha

Next Story