Top
logo

రాష్ట్రంలో 4 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశాం : మంత్రి ఈటల

రాష్ట్రంలో 4 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశాం : మంత్రి ఈటల
Highlights

కేంద్రప్రభుత్వం ఆధీనంలో ఉన్న కార్మిక శాఖతో సంప్రదింపులు జరిపి. ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేసుకున్నామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 4 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నమని ఆయన తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీలో కొనసాగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు తమ అవకాశాలను వినియోగించుకుంటున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సమాధానమిచ్చారు.

కేంద్రప్రభుత్వం ఆధీనంలో ఉన్న కార్మిక శాఖతో సంప్రదింపులు జరిపి. ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేసుకున్నామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 4 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నమని ఆయన తెలిపారు.తెలంగాణ రాష్ట్రం రాకముందు 5 మెడికల్‌ కాలేజీలు ఉండేవన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా మెడికల్‌ కాలేజీలు పెట్టాలని ఆలోచన చేశారని.., అందులో భాగంగా మహబూబ్‌నగర్‌, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేటలో ఒక్కో కాలేజీని 150 సీట్లతో ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రస్తుతం 11 మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని., ప్రైవేట్‌ పరంగా 23 మెడికల్‌ కాలేజీలున్నాయన్నారు. మెడికల్‌ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు ఇతర సిబ్బందిని పదోన్నతులు, ఇత్తర పద్దతుల ద్వారా భర్తీ చేశామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

Next Story