TS Corona Cases: కొత్తగా 3,982 కరోనా కేసులు

Samba Siva Rao
Published on: 18 May 2021 7:41 PM IST
TSCoronaCases
X

క‌రోనా వైరస్ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

TS Corona Cases: తెలంగాణలో క‌రోనా వైరస్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 71,616 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,982 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 607 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. 5,186 మంది కరోనా నుంచి కోలుకోగా, 27 మంది మృతి చెందారు.

రంగారెడ్డి జిల్లాలో 262, ఖమ్మం జిల్లాలో 247, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 225 కేసులు గుర్తించారు. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు 5,36,766 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4,85,644 మంది కోలుకున్నారు. ఇంకా 48,110 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మృతుల సంఖ్య 3,012కి చేరింది.

తెలంగాణలో కరోనా రికవరీ రేటు మరింత పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ రికవరీ రేటు 90.47 శాతం కాగా, జాతీయస్థాయిలో అది 85.6 శాతంగా నమోదైంది. దేశంలో కరోనా మరణాల రేటు 1.1 శాతం కాగా, తెలంగాణలో 0.56 శాతంగా ఉంది.




Samba Siva Rao

Samba Siva Rao

Next Story