TS Corona Cases: తెలంగాణలో కొన‌సాగుతున్న క‌రోనా ఉద్ధృతి..30మంది మృతి

TS Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.

Samba Siva Rao
Updated on: 17 May 2021 8:58 PM IST
Coronacases Telangana
X

క‌రోనావైర‌స్ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

TS Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గ‌త రెండు రోజులుగా త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లే ప‌ట్టి మ‌ళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ సహా కఠిన ఆంక్షలు కొత్త కేసులు పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. సోమవారం కొత్తగా దాదాపు 4 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24గంటల వ్యవధిలో 62,591 శాంపిల్స్‌ పరీక్షించగా.. 3961 కొత్త కేసులు నమోదయ్యాయి.

రికవరీ రేటు 90.17శాతం ఉండగా.. మరణాల రేటు 0.56శాతంగా ఉంది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సోమవారం 631 కొత్త కేసులు వచ్చాయి. కొత్తగా మరో 30మంది మరణించగా.. 5559మంది కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలుపుకొంటే రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,32,784కి చేరాయి. వీరిలో 4,80,458మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 2985మంది కొవిడ్‌తో మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 49,341 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story