TS Corona Cases: తెలంగాణలో కొత్తగా 3,821 కరోనా కేసులు, 23 మంది మృతి

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు 3821 కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Updated on: 25 May 2021 10:16 PM IST
3821 New Coronavirus Cases Reported in Tealngana on 25 MAY 2021
X

కరోనా వైరస్ (ఫొటో ట్విట్టర్)

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 81,203 నమూనాలను పరీక్షించారు. ఇందులో 3వేల821 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5లక్షల 50వేల 141 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా రాష్ట్రంలో 23 మంది కరోనాతో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, మొత్తం మరణాల సంఖ్య 3వేల169 కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 38వేల 706 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ రోజు 4వేల298 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. నేడు అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 537 కేసులు నమోదయ్యాయి.



Venkata Chari

Venkata Chari

Next Story