TS Corona Cases: తెలంగాణలో కొత్త‌గా 3,816 పాజిటివ్ కేసులు

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.

Samba Siva Rao
Published on: 16 May 2021 9:59 PM IST
Telangana Corona Cases
X

క‌రోనా వైర‌స్ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గడచిన 24 గంటల్లో 44,985 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,816 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. GHMC పరిధిలో 658 కొత్త కేసులు నమోదవ్వగా.. జిల్లాల్లో మాత్రం కరోనా వ్యాప్తి నిదానించింది. చాలా జిల్లాల్లో రెండంకెల్లోనే కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 5,892 మంది కరోనా నుంచి కోలుకోగా, 27 మంది మృతి చెందారు.

తెలంగాణలో ఇప్పటివరకు 5,28,823 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4,74,899 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 50,969 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2,955కి చేరింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story