TS Corona Cases: తెలంగాణలో కొత్తగా 3,762 కరోనా కేసులు, 20 మంది మృతి

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు 3762 కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Published on: 26 May 2021 7:19 PM IST
3762 New Coronavirus Cases Reported in Tealngana on 26 MAY 2021
X
కొవిడ్ టెస్ట్ (ఫొటో ట్విట్టర్)

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 91,048 నమూనాలను పరీక్షించారు. ఇందులో 3వేల762 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5లక్షల 63వేల 903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా రాష్ట్రంలో 20 మంది కరోనాతో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, మొత్తం మరణాల సంఖ్య 3వేల189 కి పెరిగింది. ఈ రోజు 3వేల816 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. నేడు అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 528 కేసులు నమోదయ్యాయి.

Venkata Chari

Venkata Chari

Next Story