TS Corona Cases: తెలంగాణలో కొత్తగా 3,614 కరోనా కేసులు, 18 మంది మృతి

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు 3614 కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Updated on: 27 May 2021 8:30 PM IST
3614 New Coronavirus Cases Reported in Tealngana on 27 MAY 2021
X

కరోనా టెస్ట్‌ (ఫొటో ట్విట్టర్)

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 90,226 నమూనాలను పరీక్షించారు. ఇందులో 3వేల614 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5లక్షల 67వేల 517 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా రాష్ట్రంలో 18 మంది కరోనాతో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, మొత్తం మరణాల సంఖ్య 3వేల207 కి పెరిగింది. ఈ రోజు 3వేల961 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Venkata Chari

Venkata Chari

Next Story