TS Corona Cases: కొత్త‌గా 3,464 మందికి పాజిటివ్

Samba Siva Rao
Published on: 21 May 2021 7:58 PM IST
TS Corona Cases
X

క‌రోనా వైర‌స్ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

TS Corona Cases: తెలంగాణ‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 65,997 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,464 మందికి కరోనా సోకిన‌ట్లు తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో 534 కొత్త కేసులు నిర్థార‌ణ అయ్యాయి. క‌రోనా బారిన ప‌డి 25 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,47,727 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,00,247 మంది కోలుకున్నారు. ఇంకా 44,395 మందికి చికిత్స జరుగుతోంది.

తెలంగాణలో కరోనా రికవరీ రేటు 91.33 శాతంగా నమోTS Corona Cases:దైంది. జాతీయస్థాయి రికవరీ రేటు 87.2 శాతం అని తాజా బులెటిన్ లో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో 243, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 219, ఖమ్మం జిల్లాలో 217 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,801 మంది కరోనా నుంచి కోలుకుని డిశార్జ్ అయ్యారు.




Samba Siva Rao

Samba Siva Rao

Next Story