TS Corona Cases: కొత్త‌గా 3,308 కరోనా పాజిటివ్ కేసులు

Samba Siva Rao
Published on: 22 May 2021 8:14 PM IST
Corona Virus Positive Cases Telagana
X

క‌రోనా వైర‌స్  

TS Corona Cases: తెలంగాణ‌ కరోనా వైర‌స్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గడచిన 24 గంటల్లో 63,120 కరోనా పరీక్ష‌లు నిర్వ‌హించ‌గా., 3,308 మందికి పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయ్యాయి. అత్యధికంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ పరిధిలో 513 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 16 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,723 మంది కరోనా నుంచి కోలుకోగా, 21 మంది మరణించారు.

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.56 శాతం కాగా, జాతీయస్థాయిలో అది 1.1 శాతంగా ఉంది. కరోనా రోగుల రికవరీ రేటు తెలంగాణలో 91.64 శాతానికి పెరగ్గా, జాతీయస్థాయిలో అది 87.7 శాతంగా ఉంది తెలంగాణలో ఇప్పటివరకు 5,51,035 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,04,970 మందికి కరోనా నయం అయింది. ఇంకా 42,959 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 3,106కి చేరాయి.




Samba Siva Rao

Samba Siva Rao

Next Story