TS Corona Cases: తెలంగాణలో కొత్తగా 3,043 కరోనా కేసులు, 21 మంది మృతి

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పగడుతున్నాయి. నేడు కొత్తగా 3,043 కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Updated on: 24 May 2021 10:00 PM IST
3043 New Coronavirus Cases Reported in Tealngana on 24 MAY 2021
X

కరోనా టెస్ట్ (ఫొటో ట్విట్టర్)

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 59,709 నమూనాలను పరీక్షించారు. ఇందులో 3వేల043 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5లక్షల 56వేల 320 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా రాష్ట్రంలో 21 మంది కరోనాతో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, మొత్తం మరణాల సంఖ్య 3వేల146 కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39వేల 206 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ రోజు 4వేల693 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. నేడు అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 424 కేసులు నమోదయ్యాయి.




Venkata Chari

Venkata Chari

Next Story