విషాదం: బోరుబావిలో పడ్డ బాలుని మృతి

Arun Chilukuri
Updated on: 28 May 2020 11:03 AM IST
విషాదం: బోరుబావిలో పడ్డ బాలుని మృతి
X

మెదక్‌ జిల్లాలోని పాపన్నపేట మండలం పాడ్చన్‌పల్లిలో బోరుబావిలో పడ్డ బాలుడు(సంజయ్‌సాయి వర్దన్‌) మృతిచెందాడు. నిన్న సాయంత్రం 5.45 గంటలకు మూడేళ్ల సాయివర్ధన్‌ అనే బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడ్డాడు. సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.

బోరుబావిలో మట్టిపెళ్లలు కింద బాలుడి మృతదేహం పడివుండటంతో బాలుడు ప్రాణాలు విడిచాడు. అయితే సమాంతరంగా గొయ్యిని తవ్విన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. ఆక్సిజన్‌ అందకపోవడంతో బాలుడు సంజయ్‌సాయి వర్దన్‌ మరణించాడు. బాలుడి ప్రాణాలను రక్షించడానికి 12 గంటలపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ రెస్క్యూ సిబ్బంది శ్రమించినా ఫలితం లేకపోయింది. ఈ విషాద ఘటనతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Arun Chilukuri

Arun Chilukuri

Next Story