TS Corona Cases: తెలంగాణ‌లో త‌గ్గిన క‌రోనా కేసులు..93% రికవరీ రేటు

Samba Siva Rao
Published on: 29 May 2021 9:08 PM IST
TS Corona Cases
X

క‌రోనా వైర‌స్ ప్ర‌తీకాత్మక చిత్రం

TS Corona Cases: తెలంగాణ‌లో క‌రోనా వ్యాప్తి క్ర‌మంగా త‌గ్గుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ‌డిచిన 24గంటల్లో 2,982 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 436 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఇదే అత్యల్పం అని చెప్పాలి. అదే సమయంలో 3,837 మంది కోలుకోగా, 21 మంది కరోనాతో మరణించారు. దేశంలో 90.8 శాతం రికవరీ రేటు ఉండగా... రాష్ట్రంలో ఈ రేటు 93 శాతంగా ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు సైతం జాతీయ సగటు (1.2శాతం)తో పోలిస్తే రాష్ట్రం మిన్నగా ఉందని (0.56శాతం) పేర్కొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 5,74,026 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,33,862 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 36,917 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 3,247కి చేరింది. రాష్ట్రం మొత్తమ్మీద రికవరీ రేటు 93 శాతానికి పెరిగింది. ఇతర జిల్లాల్లో చూస్తే అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 12 పాజిటివ్ కేసులను గుర్తించారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story